భూతకాలపు అలవాట్లూ, ఆచారాల నుంచి, భావికాలపు ఆదర్శాలనందుకొనేటందుకు మానవుని ప్రయత్నం అనవరతం సాగుతూనే వుంటుంది. ఈ రెండు కాలాలనూ కలుపుతున్న వర్తమాన కాలాన్ని ఒక వంతెనతో పోల్చవచ్చు.
అయితే ఈ వంతెనపై మానవుని ప్రయాణంలో క్షణక్షణం ఎదురు దెబ్బలు తగులుతాయి. తల బొప్పి కడుతూంటుంది. అలవాటయిన భూతకాలపు పరిధుల్లో నిలబడలేడు. కనిపించని భయాలతో అదురు పుట్టించే భవిష్యత్తు మీద ఆశ వదులుకోలేడు. ఆతని ప్రయాణం ఆగదు. కాని, బంధనాలేవో, ఇంధనాలేవో భేదం చూడలేని సందిగ్ధస్థితి ఆతనినడుగడుగునా వేధిస్తుంది. ఆతడు అడుగు పెట్టిన వంతెన మామూలు వంతెన కాదు.…
Your support pays for translating these classics into more languages.
Support for $12/month DonateSubscribers read with instant translation, without waiting for the free daily limit.